telugu navyamedia
సినిమా వార్తలు

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “బిగ్ బాస్” బ్యూటీ

తమిళ్‌లో బిగ్ బాస్ రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోగా… మూడవ సీజన్‌ ఇప్పటికే ప్రారంభమైంది. షో మొదలైన కొన్నాళ్లకే ఓ కంటెస్టెంట్ యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించేసుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే దర్శనమిస్తున్నాయి. శ్రీలంకకు చెందిన లోస్లియా మరియనేసన్. ఆమె అక్కడి న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా పని చేస్తోంది. ఈ లంక న్యూస్ యాంకర్ లోస్లియా మరియానేసన్ తమిళ కుర్రకారు గుండెల్లో గుబులురేపుతోంది. అందం, చక్కని మాటతీరు, చలాకీతనం, పాటలు పాడుతూ తోటి కంటెస్టెంట్లనే కాకుండా ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తోంది. దీంతో లోస్లియా పేరుతో ఇప్పటికే సోషల్ మీడియాలో ఆర్మీ కూడా ఏర్పాటైంది. గత సీజన్‌లో ఓవియాకు వచ్చినంత పాప్యులారిటీ, లోస్లియాకు స్వల్ప కాలంలోనే వచ్చేసింది. ఆమె పాడిన పాటలు, చేసిన డ్యాన్సులు టిక్‌టాక్‌తో పాటు హలో యాప్‌లోనూ ట్రెండింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Related posts