telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బిగ్ బాస్ లో రొమాన్స్ కు బ్రేక్ పడటానికి కారణం అదేనా?

బిగ్ బాస్ సీజన్ 4 మొదట్లో కొంచెం నెమ్మదిగా సాగినా కూడా ఐదో వారం ఎలిమినేషన్ వచ్చే సరికి రచ్చలకు కేరాఫ్ గా మారింది.. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఉదయం సాంగ్ తో హుషారుగా లేచిన ఇంటి సభ్యులు,తర్వాత ఒకరిపై మరోకరు కొట్లాటకు దిగారు. దీంతో షో కాస్త రసవత్తరంగా మారింది.

ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసి వారి ముఖంపై నురగను పూయాలని.. ఎందుకు పూసారో అన్నది చెప్పాలని బిగ్ బాస్ తెలిపారు.నామినేషన్ ప్రక్రియను అఖిల్‌తో ప్రారంభించారు బిగ్ బాస్. అలా ఒకరికొకరు నురగ పూసి కారణాన్ని చెప్పారు. ఇది ఇలా ఉండగా ఈ ఎపిసోడ్ లో మాత్రం మోనాల్ కు ఎక్కువ మంది పూయడంతో ఎమోషనల్ అయ్యింది. నన్ను టార్గెట్ చేయకండి అంటూ కంటతడి పెట్టింది. దీంతో షో కాసేపు నిశబ్దంగా మారింది. మరి ఈ వారం మోనాల్ ఔట్ అయినట్లే తెలుస్తుంది. ఇది ఏమైనా షో ను పూర్తిగా ఫాలో అయితేనే అర్థమవుతుంది.. చూద్దాం ఎవరు ఈ వారం ఇంట్లో ఉంటారో, ఎవరు బయటకు వెళ్తారో..

Related posts