telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరికొద్ది గంటల్లో బుల్లితెరపై బిగ్‌బాస్‌ సందడి.. మరి కంటెస్టెంట్స్…!

Bigg-Boss-4

మరికొద్ది గంటల్లో బుల్లితెరపై బిగ్‌బాస్‌ సందడి చేయబోతున్నాడు. కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా 15 మంది కంటెస్టెంట్స్‌ 100 రోజుల పాటు సందడి చేయబోతున్నారు. ఓపెనింగ్ డే షూటింగ్ కూడా శుక్రవారమే పూర్తయిందట. అయితే కంటెస్టెంట్స్‌ ఎవరనే సస్పెన్స్‌ మాత్రం ఇంకా వీడలేదు. బిగ్‌బాస్‌ ఎంట్రీకి ఒక్క రోజే ఉండడంతో కంటెస్టెంట్స్‌ ఎవరనే సస్పెన్స్ పెరిగిపోయింది. ఇప్పటికే బిగ్‌బాస్‌ -4 కంటెస్టెంట్స్‌ వీళ్లే అంటూ రకరకాల పేర్లు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేశాయి. ఇప్పటికే బిగ్‌బాస్‌-4లో తాము నటించడం లేదంటూ హీరో తరుణ్‌, హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌, కల్పిక గణేశ్, నటి సునైనా, సింగర్‌ సునీత లాంటి వాళ్లు తేల్చి చెప్పారు. అయితే తాజాగా మరో లిస్ట్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్స్‌ పక్కా వీళ్లే అంటూ 15 మంది పేర్లు సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్నాయి.

బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్స్‌ :
1. టీవీ యాంకర్ దేవి
2. దేత్తడి హారిక (యూట్యూబ్ స్టార్)
3. గంగవ్వ
4. ముక్కు అవినాష్ (జబర్దస్త్)
5. హెచ్ఎంటీవీ యాంకర్ సుజాత
6. యాంకర్ లాస్య మంజునాథ్
7. యూట్యూబ్ సంచలనం గంగవ్వ
8. యాంకర్ అరియానా గ్లోరీ
9. కరాటే కళ్యాణి
10. డైరెక్టర్ సూర్య కిరణ్
11. టీవీ నటుడు సయ్యద్ సోహైల్
12. కరాటే కళ్యాణి
13. యాంకర్ తనూజా పుట్టాస్వామి
14. హీరోయిన్ మొనాల్ గుజ్జార్
వీరితో పాటు నటి సురేశ వాణి, మెహబూబా దిల్‌ సే (టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్), పేర్లు కూడా లిస్ట్‌లో వినిపిస్తున్నాయి.

Related posts