telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రతి శుక్రవారం ఇక్కడ జాతకాలు మారిపోతాయి… సూసైడ్ చేసుకోవాలనుకున్నా… : బిగ్ బాస్ బ్యూటీ

Nandini-Rai

టాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ నందినీరాయ్ తన జీవితంలో ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి తెలిపింది. తాను కూడా ఒక టైం లో సూసైడ్ చేసుకోవాలని భావించానని, కానీ బిగ్ బాస్ తరవాత ఆ ఆలోచనలకు స్వస్తి చెప్పానని తెలిపింది. నందిని రాయ్ మాట్లాడుతూ…”సినీ ఇండస్ట్రీలో వచ్చే సక్సెస్ పాపులారిటీని క్రేజ్ ను పెంచుతాయి. ప్రతి శుక్రవారం ఇక్కడ జాతకాలు మారిపోతుంటాయి. సినిమా హిట్టా లేదా అనే భయం ఉంటుంది. దాంతో కొందరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. బిగ్ బాస్ లో అడుగు పెట్టకముందు నేను రెండు సంవత్సరాలు డిప్రెషన్ లో ఉన్నాను. డిప్రెషన్ నుండి భయటపడటానికి ఫ్రెండ్స్ తో మాట్లాడేదాన్ని. బిగ్ బాస్ తరవాత డిప్రెషన్ నుండి భయటపడ్డా” అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం పలువురు సెలబ్రెటీలు తాము డిప్రెషన్ లో ఉన్న సమయాన్ని గురించి షేర్ చేసుకుంటున్నారు. ఇదివరకే ప్రకాష్ రాజ్, కుష్బూ లాంటి నటీనటులు తమ జీవితంలో ఎదురైన పరిస్థితులను షేర్ చేసుకున్నారు.

Related posts