telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 : గంగవ్వను బయటకు పంపించేశారు…?

Gangavva

బిగ్‌ బాస్‌ హౌస్‌లో మోనాల్‌, అభిజిత్‌, అఖిల్‌ మధ్య రొమాంటిక్‌ ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ నడుస్తున్న విషయం తెలిసిందే. అలకలు, కోపాలు, గొడవలు, హగ్‌లు ఇవన్నీ ఈ మధ్యే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో గంగ‌వ్వ స్థానం ప్ర‌త్యేక‌మైన‌ది. అయితే ఆమ‌ధ్య త‌న ఆరోగ్యం బాగోలేద‌ని, ఇంటికి వెళ్లిపోతాన‌ని చేతులెత్తి వేడుకుంది. కానీ బిగ్‌బాస్ ఆమెను పంపించేందుకు సుముఖత వ్య‌క్తం చేయ‌లేదు. అందుకు బ‌దులుగా ఆమెకు వైద్యం చేయించి మ‌రికొన్ని రోజులు ఇంట్లోనే ఉంచేందుకు ప్ర‌య‌త్నించారు. ఆమె తిరిగి కోలుకొని ఎప్ప‌టిలాగే హుషారుగా క‌నిపించ‌డంతో ఇప్ప‌ట్లో అవ్వ బ‌య‌ట‌కు వెళ్ల‌ద‌ని అంద‌రూ డిసైడ్ అయ్యారు. కానీ నిన్న‌టి ఎపిసోడ్‌లో ఆమెకు మ‌ళ్లీ ఇంటిపై ప్రాణం కొట్టుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండ‌లేక‌పోతున్నాన‌ని వాపోయింది. క‌డుపు నిండా తినే త‌న‌కు ఇక్క‌డ పిడికెడు ముద్ద కూడా లోప‌లికి వెళ్ల‌ట్లేద‌ని భోరుమ‌ని ఏడిచింది. కానీ బిగ్‌బాస్ ఈసారి ఆమె వేద‌న‌ను అర్థం చేసుకోకుండా క‌ఠినంగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. అవ్వ మొర‌ను ఆల‌కించి ఆమెను బిగ్‌బాస్ హౌస్‌లో నుంచి బ‌య‌ట‌కు పంపించేసిన‌ట్లు స‌మాచారం. అనారోగ్య కార‌ణాల వ‌ల్లే ఆమెను షో నుంచి త‌ప్పించిన‌ట్లు తెలుస్తోంది.

Related posts