telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ ట్విస్ట్… ఈసారి డబల్ ఎలిమినేషన్ ?

Bigg-Boss-3

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఫైనల్ కి ఇంకా నాలుగు వారాలే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో హౌజ్ లో జరిగే సంఘటనల ద్వారా ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్నారట బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ ఎప్పుడైనా అనుకోని సంఘటనల్ని చొప్పించి ట్విస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అయితే మరోసారి ఆ దిశగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ ట్విస్ట్ డబల్ ఎలిమినేషన్ రూపంలో ఉండనుందని సమాచారం. ఈ వారం నామినేషన్ లో ఉన్న ముగ్గురిలో మహేష్ ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే మహేష్ తో పాటు వరుణ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ కి పునర్నవి అభిమానుల ఓట్లు కూడా తోడవుతున్నాయి. కానీ వరుణ్ కి అలా జరగట్లేదు. వితికా కి పెద్దగా ఫ్యాన్ బేస్ లేదు. ఇప్పటి వరకు వరుణ్ వల్ల వితికా లాభపడిందే కానీ, వరుణ్ లాభపడలేదు. అదీ గాక మిగాతా ఫ్యాన్స్ ఎవరూ వరుణ్ కి ఓటేసే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి డబల్ ఎలిమినేషన్ ఉంటే వరుణ్ కే కాదు ప్రేక్షకులకి కుడా ఊహించని షాకే. బిగ్ బాస్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రేక్షకులని షాక్ కి గురిచేసి వారి ఆసక్తిని పెంచడానికి ఈ డబల్ ఎలిమినేషన్ ని ఉపయోగించుకుంటాడా లేదంటే ఎప్పటిలానే మళ్ళీ ఈ సారి సాదాసీదాగా కానిచ్చేస్తాడా అనేది చూడాలి.

Related posts