telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరంటే ?

starmaa official on bigg boss 3 telugu

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్రమం మ‌రో రెండు వారాల‌లో ముగియ‌నుంది. బిగ్‌బాస్ 3 నుండి గత వారం మ‌హేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో బాబాభాస్క‌ర్‌, వరుణ్ సందేశ్‌, వితిక‌, రాహుల్‌, అలీ రెజా, శివ జ్యోతి, శ్రీముఖి ఉన్నారు. అయితే ఈ వారం అందరూ ఎలిమినేషన్ లో ఉండడం విశేషం. మ‌రి వ‌చ్చేవారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వీక్‌లో శివజ్యోతి కానీ, వితికా షేరు కానీ, బాబా భాస్కర్ కానీ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మధ్య తన ప్రవర్తన కారణంగా వితికా కొంచెం నెగిటివిటీ మూట గట్టుకుంది. దాదాపు వితికా షేరే.. ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందని ఓటింగ్ సరళిని బట్టి చెప్పొచ్చు. ప్రతి వారం సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు ఈ వారం వితిక షేరు హౌస్ నుండి ఎలిమినేట్ కావడం పక్కా అని చెబుతున్నారు. మొత్తానికి 12వ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి వితికా షేరు బయటకు వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉందనే టాక్ వినబడుతోంది.

Related posts