telugu navyamedia
telugu cinema news trending

ఇక శ్రీముఖి టార్గెట్ మెగా అభిమానులు… ఏం చేస్తోందంటే…!?

Srimukhi

బిగ్ బాస్-3 తెలుగు చాలా ఆసక్తికరంగా సాగుతోంది. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో విజయవంతంగా 11వ వారంలోకి అడుగుపెట్టింది. 10వ వారం పునర్నవి ఎలిమినేట్ కాగా… ఈ వారం నామినేషన్లో వరుణ్, మహేష్, రాహుల్ ఉన్నారు. కాగా… బిగ్ బాస్ హౌస్‌లో శ్రీముఖి చాలా టఫ్ కంటెస్టెంట్. పోటీలో ఉన్నవారిని ఢీకొట్టి వారం వారం ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. అటు టాస్క్‌ల విషయంలో కావొచ్చు. పెర్ఫార్మెన్స్ విషయంలో కావొచ్చు. శ్రీముఖి ఇతర కంటెస్టెంట్లకు దీటుగా బదులిస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 టైటిల్ విన్నర్‌గా నిలవడానికి ఆమె తీవ్రంగా తపిస్తోంది. అందుకోసం ప్రజల మద్దతు కూడగట్టుకుంటోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమెకు ఫ్యాన్ పేజీలు, శ్రీముఖి ఆర్మీలు ఏర్పడ్డాయి. ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన ప్రతిసారీ.. శ్రీముఖి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు. ఆమెను ఎలిమినేట్ కానివ్వకుండా చూస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న సపోర్ట్‌ను మరింత పెంచుకునేందుకు శ్రీముఖి అభిమానులు లేదా అనుచరులు ఓ ప్లాన్ వేశారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయింది. అక్టోబర్ 2న ఈ మూవీ ధియేటర్లకు వచ్చింది. మెగాస్టార్ క్రేజ్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర అనడంతో అభిమానులు కూడా భారీగా ధియేటర్లకు క్యూ కడతారు. అలా వచ్చిన వారిని తమవైపు తిప్పుకొనేందుకు తన ఫ్యాన్స్ గా మార్చుకునేందుకు శ్రీముఖి ఫ్యాన్స్ ప్రయత్నాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజైన ధియేటర్లలో శ్రీముఖికి సంబంధించిన యాడ్స్ ప్లే చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో శ్రీముఖికి మద్దతుగా ఓటు వేయాలంటూ ధియేటర్లకు వచ్చిన మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది.

Related posts

డేటింగ్ యాప్ లో పరిచయమైన అతడు… కారులో వెళ్తుండగా…!?

vimala p

బ్యాంక్ అకౌంట్ తెరిచే ముందు ఈ చార్జీల గురించి తప్పక తెలుసుకోండి

vimala p

కోటి విరాళం ప్రకటించిన పవర్ స్టార్…

Vasishta Reddy