telugu navyamedia
telugu cinema news

బిగ్ బాస్-3 ప్రోమో… త్వరలోనే షో ప్రారంభం

Bigg-Boss-3

బుల్లితెర ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. స్టార్ మా యాజ‌మాన్యం త‌మ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ ద్వారా బిగ్ బాస్ 3 ప్రోమో విడుద‌ల చేశారు. అతి త్వ‌ర‌లో ప్రారంభం అవుతుంద‌ని మాత్ర‌మే ఈ ప్రోమో ద్వారా హింట్ ఇచ్చారు. ప్రోమోని చూస్తుంటే ఈ సారి ఈ కార్య‌క్ర‌మాన్ని స‌రికొత్త‌గా రూపొందిస్తున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. సీజ‌న్ 3కి హోస్ట్‌గా నాగార్జున పేరు, కంటెస్టెంట్లుగా ప్ర‌ముఖుల పేర్లు వినిప‌స్తున్నాయి. కామ‌న్ మ్యాన్‌కి ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో ఎంట్రీ లేన‌ట్టుగా అన‌ధికార స‌మాచారం. జూలైలో రెండో వారంలో లేదంటే చివ‌రి వారంలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ 3 కార్య‌క్ర‌మాన్ని హోస్ట్‌గా నాగార్జున ఎంత ర‌క్తి క‌ట్టిస్తారో చూడాలి. సీజన్ 1ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, సీజ‌న్ 2కి నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే.

Related posts

నాగార్జున ఇంటి చుట్టూ పోలీసు ఫోర్స్… బిగ్ బాస్ ఎఫెక్ట్

vimala p

మైసూర్ పాక్ కొందామని మైసూర్ కు వెళ్తున్న హీరో… “జోడి” టీజర్

vimala p

చిరంజీవి మనవరాలి అన్నప్రాసన వేడుక… స్పెషల్ అట్రాక్షన్ గా పవన్ భార్య

vimala p