telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్ళి పీటలెక్కనున్న పునర్నవి భూపాలం

Punarnavi

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ‘బిగ్ బాస్’ సీజన్ 3లో పునర్నవికి ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమెస్నేహం ‘బిగ్ బాస్’ షోకే ఒక క్రేజ్ తీసుకొచ్చింది. వెండితెరపై మెరిసి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా.. మంచి పేరును తెచ్చుకుంది. పిట్టగోడ, ఉయ్యాల జంపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాల్లో మంచి నటనను కనబర్చింది. అయితే సినిమాల ద్వారా కంటే బిగ్‌బాస్ షో ద్వారానే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. నిజానికి బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో లవ్‌ట్రాక్‌ నడిచింది. ప్రేక్షకులంతా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారేమోనని అనుకున్నారు. పలు ఇంటర్వ్యూల్లో వీరిద్దరికీ ఇదే ప్రశ్న ఎదురైంది. కానీ ఇద్దరూ అలాంటిదేమీ లేదని, తాము స్నేహితులమని చెబుతూ వచ్చారు.  ఇక పెళ్లి ఫిక్స్ అయ్యిందన్న విషయాన్ని పునర్నవి స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. “ఫైనల్లీ ఇట్స్‌ హ్యాపెనింగ్‌” అంటూ తనకు ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయాన్ని ప్రకటించింది. ఈ ఫొటోలోనే ఆమె చేయిని మరో చేయి పట్టుకుని ఉంది. ఆ చేయి ఎవరదనేది మాత్రం పునర్నవి చెప్పలేదు. పునర్నవి పెళ్ళి ఎవరితో అనే విషయం తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

Finally! It’s happening 🥰❤️

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

Related posts