telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బుల్లితెర సెన్సేష‌న‌ల్ గా … బిగ్ బాస్ షో …

ou students complaint on bigg boss 3 telugu

బిగ్ బాస్ 3 బుల్లితెర సెన్సేష‌న‌ల్ షో గా సంచలనాలు సృష్టిస్తుంది. ఈ కార్య‌క్ర‌మం జూలై 21న ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. నాగార్జున హోస్ట్‌గా 15 మంది స‌భ్యుల‌తో మొద‌లైన ఈ కార్య‌క్ర‌మంలో తొలి ఎలిమినేట‌ర్‌గా హేమ బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఆమె స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా త‌మ‌న్నా సింహాద్రి ఇంట్లోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం జ‌ర్నీ 11 రోజులు కాగా, ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రేక్ష‌కులు బాగా ఆద‌రిస్తున్నారు. 17.92 టీఆర్‌పీ రేటింగ్ ఈ షోకి రావ‌డంతో అంద‌రు షాక్ అవుతున్నారు.

గ‌తంలో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ తొలి సీజన్ 16.18 రేటింగ్ రాబట్టగా నాని రెండో సీజన్‌ 15.05 రేటింగ్ మాత్రమే సాధించింది. మ‌రి సీజ‌న్ 3కి ఇంత భారీ రేటింగ్ వ‌స్తుందంటే అది కేవ‌లం నాగ్ వ‌ల‌నే సాధ్యం అయింద‌ని అభిమానులు అంటున్నారు. నాగ్ ఒక వైపు బుల్లితెర‌పై అల‌రిస్తూనే ఆగ‌స్ట్ 9న మ‌న్మ‌థుడు 2 చిత్రంతో వెండితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ద‌మ‌య్యాడు.

Related posts