telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

నూజివీడు అసెంబ్లీ బరిలో బిగ్ బాస్2 సంజన!

Bigg boss 2 sanjana contesting elections

ఈ సారి జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో పలువురు సినీ నటులు అధికార ప్రతిపక్ష పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. నూజివీడు అసెంబ్లీ బరి నుంచి బిగ్ బాస్2 సంజన స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన సాయిసంజన అసలు పేరు అన్నే వనజ. 2016లో ఆమె మిస్‌ హైదరాబాద్‌గా ఎంపికయ్యారు. అడపాదడపా కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు చేసినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

కాగా బిగ్ బాస్ 2 ద్వారా ఫేమస్ అవుదామని ప్రయత్నించింది. అక్కడ కూడా బెడసి కొట్టడంతో మొదటి వారంలోనే ఆమె బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చింది. సినీపరిశ్రమలో చేరిన అనంతరం జనజాగృతి పార్టీలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నూజివీడు అభ్యర్థిగా పోటీచేసేందుకు ప్రయత్నించారు. టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నూజివీడు అసెంబ్లీ నుంచి పోటీచేస్తున్నారు. కాగా ఇప్పుడు ఆమె ఎన్నికల బరిలో దిగడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

Related posts