telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరుత హీరోయిన్ “బిగ్ బాస్” ఎంట్రీ

Neha-Sharma

సల్మాన్ ఖాన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న భారీ రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ కు భారీ ఆదరణ లభించిన విషయం తెలిసిందే. హిందీ బిస్ బాస్ సీజన్ 14 అక్టోబర్1న మొదటి ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే ఈ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ లిస్టును నిర్వాహకులు సిద్ధం చేశారు. జాస్మిన్ భాసిన్, నిశాంత్ సింగ్ మాల్కని, ఇజాజ్ ఖాన్, పవిత్ర పునై, నైనా సింగ్, కుమార్ జానూ, అలీ గొనీ, రాహుల్ వైద్య, కరణ్ పటేల్, స్నేహ ఉల్లాల్, క్యారీ మినాటీ (యూట్యూబర్)తో పాటు మరో ముగ్గురు యూట్యూబర్ ఈ ఏడాది కంటెస్టెంట్లుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. కాగా హీరోయిన్ నేహ శర్మ కూడా ఈ సీజన్ లో పాల్గొనబోతోంది. చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ఛాన్స్ కొట్టేసింది. ఇంకా వీరితో పాటు మాజీ బిగ్ బాస్ విన్నర్స్ హినా ఖాన్, గౌహర్ ఖాన్, సిద్ధార్థ్ శుక్లాలను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

Related posts