telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్రబాబుతో బిగ్ బాస్ భేటీ

Bigboss koushil,chandrababu
బిగ్ బాస్ షోలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కౌశ‌ల్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి వచ్చిన కౌశల్.. బాబుతో సమావేశమయ్యారు. టీడీపీతో కలిసి పని చేయడానికి  సుముఖత వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీలో ప్రచారానికి కౌశల్ సంసిద్ధత వ్యక్తం చేశారు. తమ పార్టీకి మద్దతు ఇవ్వడానికి కౌశల్ ముందుకు రావడాన్ని చంద్రబాబు ఆహ్వానించారు. 
తొలుత అన‌కాప‌ల్లి ఎంపీ సీటు కోసం  కౌశ‌ల్ ప్రయత్నిస్తున్నట్లు  ప్రచారం జరిగింది.  కానీ అక్కడ  కొణ‌తాల రామకృష్ణకు సీటు ఖరారు కావ‌డంతో చివ‌ర‌కు ఆయ‌న ప్రచారకర్తగా  టీడీపీలో కొన‌సాగేందుకు అంగీక‌రించారు. ఆయన టీడీపీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని కూడా గతంలో ప్రచారం జరిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొస్తాలోని ప‌లు జిల్లాల్లో ఆయ‌న పర్యటించి  టీడీపీ త‌రుపున ప్రచారం చేయడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది.

Related posts