telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష తీర్పునిచ్చారు: కేటీఆర్

ktr trs president

అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏకపక్ష తీర్పునిచ్చారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశ చరిత్రలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఇంత ఏకపక్ష తీర్పురాలేదన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధకి స్థానాలతో గెలుపొందిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నారన్నారు. వందశాతం జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవడం ఇంతవరకు దేశంలో ఎక్కడా జరుగలేదన్నారు.

తెలంగాన ప్రజల చైతన్యానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విజయంలో కీలకపాత్ర పోషించిన టీఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు తెలియజేశారు. ఆరు జిల్లాల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిందన్నారు. మరో ఆరు జిల్లాల్లో విపక్షాలకు ఒక్కో స్థానం మాత్రమే దక్కిందని తెలిపారు. 32కు 32 జిల్లాల్లో జెడ్పీ పీఠాలను టీఆర్ఎస్ సొంతంగా కైవసం చేసుకుందన్నారు. ఓటు వేసిన ప్రజలందరికీ తలవంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో కష్టపడ్డ జిల్లా పార్టీ ఇన్ ఛార్జిలకు అభినందనలు తెలిపారు.

Related posts