telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ సీజన్ 5లో బిగ్ మిస్టేక్ ఇదేనా?

19 మంది కంటెస్టెంట్లుల‌తో ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ సీజన్ 5లో మొద‌టి వారం పూర్తి చేసుకుని రెండో వారం లోకి అడుగుపెట్టింది. నాలుగు సీజ‌న్ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని ఈ సీజన్ లో బిగ్ మిస్టేక్ చేశార‌ని వాద‌న వినిపిస్తుంది. అయితే వంద రోజులుంటానని కొండంత ఆశతో బిగ్‌బాస్‌ షోలో అడుగు పెట్టిన‌ యూట్యూబర్‌ సరయూ. కానీ టైం బాగోలేక వారానికే ఇంటి బాట పట్టింది.

Bigg Boss 5 Telugu: బూతులు తిట్టమంటూ సరయుని కోరిన నాగ్.. ఇక అమ్మడు ఆగేనా.. | Bigg boss 5 telugu 5 sarayu date with host Nagarjuna | TV9 Telugu

సరయు ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయే ముందు చివరి టాస్క్ గా ఐదుగురు వరెస్ట్ కంటెస్టెంట్లు, ఐదుగురు బెస్ట్ కంటెస్టెంట్ల పేర్లు చెప్పి.. ఎందుకో కారణాలు కూడా చెప్పమన్నాడు హోస్ట్ నాగార్జున. ఇచ్చిన ఛాన్స్‌ను వ‌దులు కోకుండా సరయూ స్టేజీ మీద పూనకంతో ఊగిపోతూ ఒక్కొక్కరికి ఇచ్చి పడేసింది.

Big Boss Telugu 5: Sarayu ఫస్ట్ ఎలిమినేటర్‌గా - Telugu Oneindia

ఇదిలా ఉంటే ..ఈ సీజన్ లో హౌజ్ నుంచి వెళ్లిపోతున్న కంటెస్టెంట్ స‌ర‌యు వేయాల్సిన బిగ్ బాంబ్ ఆప్షన్ బిగ్ బాస్ ఈ వారం ఇవ్వలేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో నెటిజనులు బాగా ట్రోల్ చేస్తున్నారు.

అయితే.. గత నాలుగు సీజన్లలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్.. హౌజ్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్ల మీద బిగ్ బాంబ్ వేసి ఏదో ఒక శిక్ష పడేలా చేయొచ్చు. కానీ.. ఈ సారి అది కనిపించడం లేదు. ఈ సీజన్ లో సరయు ఎలిమినేట్ అయినప్పడు బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమె ఏ కంటెస్టెంట్ మీద బిగ్ బాంబ్ వేయలేదు.

దీనిపై ఈ సీజన్ లో బిగ్ బాంబ్ ఇవ్వడం బిగ్ బాంబ్ ఆప్షన్ అనేది కావాలనే తీసేసారా? కొత్త రూల్స్, షోలో మార్పులు చేర్పులు చేశారా? మర్చిపోయారా లేక ఇవ్వడమే మానేశారా? అంటూ ప్రశ్నలు వ‌ర్షం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాంబ్ మర్చిపోయి ఉన్నట్లయితే నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కు ఆ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.

Related posts