telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 : మొదటి వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు ?

Bigg-Boss

16 మంది సెలబ్రెటీలు బిగ్‌బాస్‌ 4 హౌస్‌లో అడుగు పెట్టడంతో సందడి మొదలైంది. మొత్తానికి ఈ వారంలో ఎలిమినేషన్‌లో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వ ఉన్నారు. మొద‌టి వారంలోనే అంద‌రూ కలిసి ఆమెను ఎలిమినేష‌న్ రౌండ్‌కు పంపించారు. అయితే కంటెస్టెంట్స్ అందరిలో గంగ‌వ్వే పాపుల‌ర్ అవుతోంది. అంతేకాదు అవ్వ‌కు ఆర్మీ కూడా త‌యారైంది. యితే ఈ ఏడుగురికి కొన్ని టాస్కులు పెట్టి.. విజేతలుగా నిలిచిన కొందరిని బిగ్‌బాస్‌ సేవ్‌ అయినట్టుగా ప్రకటించే అవకాశముంది. మిగతావారిలో ఒకరు ఎలిమినేట్‌ కాక తప్పదు. నామినేషన్‌లో ఉన్నవారిలో ఎవరెవరు సేవ్‌ అవుతారో శనివారం నాటి ఎపిసోడ్‌లో వెల్లడవుతుంది. కాగా ఈసారి కంటెస్టెంట్ల సెలక్షన్ బాలేదని ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా కొత్తగా మరో ఇద్దరు కంటెస్టెంట్లను బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. వారిలో జ‌బ‌ర్ద‌స్థ్ క‌మెడియ‌న్ ముక్కు అవినాష్, ఈ రోజుల్లో’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్, ‘జంప్ జిలానీ’ హీరోయిన్ ‌స్వాతి దీక్షిత్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా గత సీజన్‌లో హౌజ్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లు పెద్దగా ఆకట్టుకోలేదు.

Related posts