telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

చివరకు ఓటమిని ఒప్పుకున్న ట్రంప్…

trump usa

అమెరికాకు మరికొద్దిరోజుల్లో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. జనవరి 20న 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు జో బైడెన్‌. వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హారీస్‌ అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎలక్టోరల్ ఓట్ల ఆధారంగా… వైస్ ప్రెసిడెంట్‌ మైక్ పెన్స్‌… బైడెన్‌ పేరును అధికారికంగా ప్రకటించారు. మొత్తం ఎలక్టోరల్‌ కాలేజీలో… జో బైడెన్‌కు 306 ఓట్లు రాగా… ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి. నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. మెజార్టీ రాష్ట్రాల్లో స్పష్టమైన ఫలితం రాగా… జార్జియా, పెన్సిల్వేనియా, ఆరిజోనా, నెవెడా, మిచిగాన్‌లో బైడెన్‌ను గెలుపుపై రిపబ్లికన్లు అభ్యంతరం వ్యక్తం చేయగా… యూఎస్ కాంగ్రెస్ తిరస్కరించింది. చర్చకు ముందే వాటికి సంబంధించిన తీర్మానాలు వీగిపోయాయి. అయితే 400 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికా పరిపాలనలో ఎప్పుడూ జరగని విధంగా వేలాది మంది ప్రజలు క్యాపిటల్ హౌస్ ను ముట్టడించారు.  ఈ ముట్టడితో అమెరికా మొత్తం నివ్వెరపోయింది.  ముట్టడించిన నిరసనకారులు ట్రంప్ మద్దతుదారులు కావడంతో, అమెరికా కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  ముట్టడి తరువాత యూఎస్ కాంగ్రెస్ జో బైడెన్ విజయాన్ని ఖరారు చేసింది.  యూఎస్ కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించడంతో ట్రంప్ ఓటమిని అంగీకరించక తప్పలేదు.  రెండోసారి అధ్యక్ష పదవిలో కొనసాగడం లేదని ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు.  ముట్టడి చేసిన ప్రజలపై అయన మండిపడ్డారు.  కేంద్ర బలగాల ఆధీనంలో క్యాపిటల్ హౌస్ ఉందని, ప్రస్తుతం శాంతిభద్రతలు కంట్రోల్ లోనే ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. 

Related posts