telugu navyamedia
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ కు భూమిక గ్రీన్ సిగ్నల్

Bhumika

ఇక అల‌నాటి అందాల తార భూమిక ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. పెళ్ళి తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన భూమిక ఈ మ‌ధ్య స‌పోర్టింగ్ క్యారెక్టర్స్‌లో న‌టిస్తూ అభిమానుల ఆద‌ర‌ణ‌ని పొందుతుంది. తాజాగా భూమిక కూడా ‘భ్రమ్‌’ అనే ఓ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇందులో బాలీవుడ్ న‌టి కొల్కి కొచ్లిన్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, సంజయ్‌ సూరి, ఓంకార్‌ కపూర్, ఐజాజ్‌ ఖాన్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ వెబ్ సిరీస్ చిత్రీక‌ర‌ణ‌ని మొద‌లు పెట్ట‌గా, సిమ్లాలోనే ఎక్కువ శాతం షూటింగ్‌ని జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో డిజిట‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన ప‌లు ప్లాట్ ఫామ్స్‌పై ఆడియ‌న్స్ ఎక్కువ‌గా దృష్టి సారిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో అయితే వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఏర్ప‌డింది. వాటికి ఎక్కువ‌ ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డంతో టాప్ స్టార్స్ కూడా ఇందులో భాగం అవుతున్నారు. అప్ప‌ట్లో నిహారిక ప‌లు వెబ్ సిరీస్‌లు చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది. స‌మంత కూడా ఓ వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు సిద్ధ‌మైంది. శ్రీకాంత్ కూడా “చద‌రంగం” అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నాడు.

Related posts