telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భయపెట్టాలని చూస్తే…రెట్టింపుగా స్పందిస్తాం : అఖిల ప్రియ వార్నింగ్‌

ఏపీలో ఇవాళ జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. అయితే..తాజాగా ఏపీ జిల్లా పరిషత్‌ ఎన్నికలపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసులు పెడతామని బెదిరిస్తూ వైసీపీ ఏకపక్షంగా ఓట్లు వేయించుకుంటోందని… ఓట్లు లేని వ్యక్తులు బాచేపల్లిలో ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. వన్ సైడ్ ఓట్లు వేయించేందుకు ప్రయత్నం చేస్తున్న వైసీపీ వాళ్ళను పోలీసులు ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారని ప్రశ్నించారు. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారని… మమ్మల్ని భయపెట్టాలని చూస్తే రెట్టింపుగా స్పందించాల్సి వస్తుందని వైసీపీకి భూమా అఖిల ప్రియ వార్నింగ్‌ ఇచ్చారు. కాగా…భూమా నాగిరెడ్డి-శోభా దంపతుల రాజకీయ వారసురాలిగా ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ కీలకనేతగా ఉన్న సంగతి తెలిసిందే. 2014లో ఆళ్ళగడ్డ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీ తరుపున ఏకగ్రీవంగా ఎన్నికై.. అనతరం టీడీపీలో జాయిన్ అయ్యి మంత్రి పదవిని దక్కించుకుంది అఖిల ప్రియ. ఆంధ్రప్రదేశ్ మాజీ టూరిజమ్ శాఖా మంత్రిగా పనిచేసిన అఖిల ప్రియ.. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది.  బోయిన్‌పల్లిలో కిడ్నాప్‌ కేసులో అసలు సూత్రధారిగా అఖిలప్రియ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బెయిల్ పై బయటకు వచ్చారు. 

Related posts