telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అఖిల ప్రియ కేసు…అర‌్థరాత్రి వైద్య పరీక్షలు

అఖిలప్రియ హెల్త్‌ రిపోర్టులో మరో ట్విస్ట్ నెలకొంది. అఖిలప్రియకు గుట్టుచప్పుడు కాకుండా అర్థరాత్రి వైద్య పరీక్షలు చేయించారు. హెల్త్ కండిషన్ పై అఖిల ప్రియ కు వైద్య పరీక్షలు చేయించిన జైలు అధికారులు…ఉస్మానియా కు అర్ధరాత్రి తరలించి పరీక్షలు చేయించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి పై సోమవారం కోర్టు ముందు రిపోర్ట్ దాఖలు చేయాల్సి ఉండటంతో పరీక్షలు చేయించారు. ఆమె గర్భవతి, ఫీట్స్ వస్తున్నాయని అఖిల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకుపోవడం తో వైద్య పరీక్షల కు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. సిటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించిన అధికారులు… రిపోర్టులో ఆమె గర్భవతి కాదని వచ్చినట్లు చెబుతున్నారు అధికారులు. సోమవారం రిపోర్ట్ కోర్టు కు సబ్మిట్ చేయనున్న జైలు అధికారులు… అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలంటూ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. స్కానింగ్ రిపోర్ట్ లు నెగటివ్ గా రావడంతో బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. సోమవారం బెయిల్, కస్టడీ పీటీషన్ లపై ఆదేశాలు జారీ చేయనుంది కోర్టు.

Related posts