telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

భూమా అఖిలప్రియ అరెస్ట్…

bhuma akhila priya

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేశారు పోలీసులు.. కూకట్‌పల్లిలో భూమా అఖిలప్రియను అదుపులోకి తీసుకున్నారు. అయితే హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి… కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించగా… ఈ కేసులో ఆమెను మహిళా పోలీస్‌ స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు.  కాగా, ఈ కిడ్నాప్‌కు హపీజ్‌పేట్‌లోని భూ వ్యవహారమే కారణంగా చెబుతున్నారు. భూమా నాగిరెడ్డి హయా నుంచి ఈ భూ వివాదం కొనసాగుతోంది. భూమి అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి సోదరుడు సెటిల్‌మెంట్‌ చేసేందుకు ప్రయత్నించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారు. మొత్తం ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.. కూకట్‌పల్లిలో భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయగా… ఆమె భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నారు. కాగా, బోయినపల్లిలో ప్రవీణ్‌రావు ఇంటిపై రాత్రి 7 గంటల సమయంలో ఇన్‌కంటాక్స్ అధికారులంటూ  రైడ్స్ చేశారు దుండగులు.. నకిలీ సర్చ్ వారెంట్ , నకిలీ ఐడీ కార్డులు చూపించి హల్‌చల్ చేశారు.. నకిలీ ఐటీ అధికారుల వేషంలో ఇంట్లోకి ప్రవేశించిన కిడ్నాపర్లు… ఇల్లు సెర్చ్ చేయాలని చెప్పి వారి దగ్గర మొబైల్స్ ను లాగేసుకున్నారు.. సునీల్ రావు, నవీన్ రావు, ప్రవీణ్ రావును హాల్‌లో కూర్చుబెట్టి విచారణ చేస్తున్నట్లు నటించారు.. సెర్చ్ వారెంట్ ను సైతం కుటుంబ సభ్యులకు చూపించారు.. ఇక, ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులను బెడ్ రూమ్‌లో బంధించారు కిడ్నాపర్లు.. అయితే, రాత్రి 8.40 గంటలకు ఇంటికి చేరుకున్నారు కిడ్నాప్‌కు గురైన సునీల్ భార్య సరిత… ప్రవీణ్ రావు తల్లితో పాటు మిగిలిన సోదరులు కుటుంబ సభ్యులను గదిలో లాక్ చేసి ఉంచడంతో షాక్‌కు గురైంది.. ఐటీ అధికారులమని వచ్చి మమ్మల్ని రూమ్‌లో పెట్టారని తెలిపారు.. అప్పటికే, ముగ్గురు ని కిడ్నాప్ చేసి ఇంటి నుండి తప్పించుకున్నారు కిడ్నాపర్లు.

Related posts