telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భోపాల్ : .. ఉద్యమ నేత అబ్దుల్‌ జబ్బర్‌ .. మృతి..

bhopal gas leak protester abdul babbar died

ఉద్యమ నేత అబ్దుల్‌ జబ్బర్‌ మృతి చెందారు. ఈ అయన 1984లో సంభవించిన భోపాల్ గ్యాస్ ప్రమాద బాధితుల కోసం సుదీర్ఘంగా ఉద్యమాలు చేశారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనలో 20 వేల మంది బాధితుల న్యాయం కోసం పోరాడిన ఆయన అనారోగ్యంతో మరణించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున‍్న ఆయన వైద్య ఖర్చులను భరిస్తామని కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం ముంబైకి తరలించాలని ప్రయత్నించారు. కానీ ఇంతలోనే ఆయన కన్నుమూయడం విషాదం. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదమైన భోపాల్ గ్యాస్ ప్రమాదంలో అబ్దుల్ జబ్బర్ తన తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయారు. ఈ ప్రమాదంలో జబ్బర్ కూడా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌తో బాధడ్డారు.

ప్రమాదం కారణంగా 50 శాతం దృష్టిని కోల్పోయినప్పటికీ జబ్బర్ న్యాయం కోసం తన పోరాటం ఎప్పుడూ ఆపలేదు. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన బాధితుల తరపున పోరాడేందుకు 1987లో, ‘భోపాల్ గ్యాస్ పీడిత్‌ మహీళా ఉద్యోగ్ సంఘటన్’ను ప్రారంభించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 అర్థరాత్రి మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీక్ కావడంతో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి అనేకమంది దీని కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. భోపాల్ గ్యాస్ విషాదం జరిగిన కొద్దిసేపటికే.. అమెరికా పౌరుడైన యూనియన్ కార్బైడ్ సీఈఓ వారెన్ ఆండర్సన్ తప్పించుకున్నాడు. ఈ కేసులో విచారణకు హాజరుకాలేదు. అతను 2013లో అమెరికాలో మరణించాడు.

Related posts