telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

భోగి వేడుకలలో .. ప్రముఖులు…

bhogi celebrations by vice president

ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. పలువురు ప్రముఖులు కూడా ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొంటూ.. సంస్కృతీ-సాంప్రదాయాలపై నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. చెన్నైలో కుటుంబసభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వెంకయ్య సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి రైతులందరికీ శుభాలు చేకూర్చాలన్నారు. భోగి పండుగ అంటే మంచిని ఆహ్వానించి చెడును వదిలి పెట్టడమని తెలిపారు. సంక్రాంతి అంటే పెద్దలను స్మరించుకుని వారు చూపిన మార్గాన్ని అనుసరించడమని పేర్కొన్నారు. అలాగే కనుమ పండగ అంటే ప్రకృతిని ప్రేమించడం, పశుపక్ష్యాదులను పూజించడమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Related posts