telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

సంక్రాంతి వచ్చేనోయ్ .. పందెం కోళ్లు ఆన్ లైన్ లో .. ప్రత్యక్షమోయ్ ..!

betting roosters online sales started

సంక్రాంతి పండగ అంటే కోడి పందేల హడావుడి మొదలవుతుంది. ఈ క్రమంలోనే ఉభయగోదావరి జిల్లాల్లో ఆన్లైన్‌లో పందెంకోళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. యజమానులు తమ ఇంటి వద్ద నుంచే పందెంకోళ్ల ఫోటోలు, ధరలను తెలుపుతూ.. అంతర్జాలంలో అమ్ముకుంటున్నారు. జిల్లాలోని ఏలూరు, భీమవరం, నరసాపురం ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు ఈ స్టైల్‌లో అమ్మకాలు చేపడుతున్నారు.

ఈ జాడ్యం లో పడి ఏపీతో పాటు కేరళ, కర్నాటక, గోవాకు చెందిన వారు ఎక్కువగా ఈ పందెం కోళ్లను సామాజిక మాధ్యమాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అటు ఒక్కో పుంజును జాతిని బట్టి వెయ్యి నుంచి రూ. 5 వేల వరకు అమ్ముతున్నారు. ముఖ్యంగా వీటిని OLX, ఫేస్‌బుక్‌లో ఫోటోలు పోస్ట్ చేసి తమ ఫోన్‌ నెంబర్ల ద్వారా బేరసారాలు సాగిస్తున్నారు.

Related posts