telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఉబెర్ బుక్ చేసి డ్రైవర్ ను బాయ్ ఫ్రెండ్ లా నటించమంటే… అతను చేసిన పని…!

Uber

అమెరికాలోని ఇల్లినాయిస్‌లో బ్రాండన్ గేల్ అనే వ్యక్తి ఉబర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఓ రోజు సాయంత్రం అతనికి కార్ బుకింగ్ వచ్చింది. ఆ బుకింగ్ తీసుకున్న బ్రాండన్.. కారు స్టార్ట్ చేశాడు. దారిలో ఉండగా కారు బుక్ చేసిన అమ్మాయి నుంచి అతనికి ఓ మెసేజ్ వచ్చింది. “నా దగ్గరకు వచ్చినప్పుడు ఉబర్ డ్రైవర్‌లా కాకుండా నా బాయ్‌ఫ్రెండ్‌లా నటించండి” అని ఉందా మెసేజ్‌లో. దాన్ని చూసి కంగుతిన్న బ్రాండన్ విషయమేంటని ఆరా తీయగా… తనను ఓ వ్యక్తి వెంబడిస్తున్నాడని, ఒంటరిగా వదలడం లేదని చెప్పిన ఆమె.. అతన్ని మోసం చేయడానికి ఇంతకంటే మరోమార్గం కనిపించలేదని చెప్పింది. దానికి సరేనన్న బ్రాండన్… కారుపై ఉన్న ఉబర్ స్టిక్కర్స్ తీసేశాడు. తన వేలికున్న పెళ్లి ఉంగరం కూడా దాచేశాడు. బాయ్‌ఫ్రెండ్‌లా నటించి ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపేశాడు. ఈ అనుభవాన్ని అతను ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు. ఈ పోస్టు చదివిన నెటిజన్లు బ్రాండన్‌ చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Related posts