telugu navyamedia
telugu cinema news trending

కెజిఫ్ హీరో హత్యకు కుట్ర పన్నిన భరత్ ఎన్‌కౌంటర్

kgf

కెజీఎఫ్‌ మూవీతో నేషన్‌వైడ్ స్టార్ డమ్ సంపాదించుకున్న రాక్ స్టార్ యశ్..హత్యకు ప్లాన్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు స్లమ్ భరత్‌. హత్య, హత్యాయత్నం సహా 50కిపైగా క్రిమినల్​ కేసులు ఉన్న మోస్ట్ డేంజరస్ పర్సన్ అతను. ఇంతటి నేరచరిత్ర కలిగిన స్లమ్ భరత్ అనే రౌడీ షీటర్‌ను బెంగుళూరు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. పలు నేరారోపణలతో పరారీలో ఉన్న స్లమ్ భరత్‌ను రెండు రోజుల క్రితం యూపీలో అరెస్ట్ చేసిన పోలీసులు కర్ణాటకకు తీసుకొచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..క్రైమ్ సీన్ రీ కన్ష్‌స్ట్రక్షన్‌లో చేస్తోన్న సందర్భంలో భరత్..పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. తన దగ్గర ఉన్న గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఒక బుల్లెట్ ఎస్సైకి తగిలింది. మరో బుల్లెట్ వెహికల్‌కు తాకింది. బల్లెట్ ప్రూప్ జాకెట్ వాడటంతో..ఎస్సైకి ఎటువంటి హాని జరగలేదు. నిందితుడు అక్కడ్నుంచి కారులో ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించడంతో..పోలీసులు కూడా వెంబడించారు. హేసరఘట్ట వద్ద మరోసారి నిందితుడు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో భరత్ పొత్తికడుపులోకి, కాలులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన అతడిని సప్తగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి విక్టోరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే స్లమ్ భరత్ మృతి చెందాడు.

Related posts

రాశిఫలాలు : … ప్రేమవ్యవహారాలలో .. ఆర్థికంగానూ అనుకూలిస్తాయి..

vimala p

బీజేపీ కంచుకోటలో… కాంగ్రెస్ తరపున .. కరీనా కపూరా… !

vimala p

హైదరాబాద్‌ : .. హుస్సేన్ సాగర్ లోకి .. ఖైరతాబాద్‌ మహాగణపతి ప్రయాణం ప్రారంభం..

vimala p