telugu navyamedia
culture news political

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరచుకోనున్న వైన్ షాపులు!

liquor shops ap

లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రోజు నుంచే షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలతోపాటు ఇతర వ్యాపార సంస్థలను తెరవాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్ గడవు ముగియనుండడంతో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, కంటైన్‌మెంట్ జోన్లకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఇప్పటికే ఐటీ పరిశ్రమలతోపాటు 15 ప్రభుత్వ విభాగాలు, ఎరువుల దుకాణాలు తెరించేందుకు అనుమతి ఇచ్చింది.

తాజాగా, కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో పరిశ్రమలు సహా వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. బెంగళూరుతోపాటు 24 కంటైన్‌మెంట్లలో ఏవీ తెరుచుకోబోవని సీఎం స్పష్టం చేశారు. అలాగే 15వ తేదీ వరకు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడపరాదని కూడా నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

Related posts

జేఈఈ మెయిన్స్ కు మే 24 వరకు తుది గడువు

vimala p

ఏపీ : .. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ..అవార్డు .. అందుకున్న బాంబే జయశ్రీ..

vimala p

నాథూరాం గాడ్సేను మహాత్ముడని పిలవాలా?: ఒవైసీ

vimala p