telugu navyamedia
crime culture news

అంఫాన్ తో అతలాకుతలం.. 12 మంది మృతి

amphan cyclone

అంఫాన్ తుఫాన్ బెంగాల్ ను అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 12 మంది చ‌నిపోయారు. బ‌ల‌మైన ఈదురుగాలులు, వ‌ర్షాల‌కు.. వేలాది ఇండ్లు ధ్వంసం అయ్యాయి. క‌రోనా వైర‌స్ ఆంక్ష‌ల నేప‌థ్యంలో.. స‌హాయ‌క చ‌ర్య‌లు అంతంత‌గానే సాగుతున్నాయి. బెంగాల్ తీరం వ‌ద్ద సుమారు గంట‌ల‌కు 185 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

క‌రోనా వైర‌స్ క‌న్నా అంఫాన్ తుఫాన్ ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. అంఫాన్ నష్టం సుమారు ల‌క్ష కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని ఆమె అంచ‌నా వేశారు. దాదాపు అయిదు ల‌క్ష‌ల మందిని షెల్ట‌ర్ హోమ్‌ల‌కు త‌ర‌లించారు. ఒడిశాలో కూడా ల‌క్ష‌కు పైగా మందిని షెల్ట‌ర్ హోమ్స్‌కు పంపించారు.అతి తీవ్ర తుఫాన్‌గా మారిన అంఫాన్‌.. రానున్న మూడు గంట‌ల్లో అల్ప‌పీడ‌నంగా మార‌నున్నట్లు ఐఎండీ అధికారి తెలిపారు. బెంగాల్ నుంచి ఈశాన్య దిశ‌గా బంగ్లాదేశ్ వైపు తుఫాన్ ప్ర‌యాణిస్తున్న‌ది.

Related posts

స్పీకర్ కు సీఎల్పీ విలీన లేఖను అందజేసిన ఎమ్మెల్యేలు

vimala p

అన్ని హంగులతో కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌.. ఈ నెల 17న ప్రారంభం

vimala p

విమానంలో సిగ్గు లేకుండా ప్యాంటు జిప్పు విప్పి… ఎయిర్‌హోస్టెస్‌తో…

vimala p