telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

బెనెల్లీ బైక్ లు .. ఇండియాలో.. బుకింగ్ కు సిద్ధం..

benelli bike booking open in india

బెనెల్లీ బైక్, ఇది ఇటలీకి చెందిన సూపర్ బైక్ ల తయారీ సంస్థ. తాజాగా ఈ సంస్థ నుండి రెండు సరికొత్త బైక్ లు విడుదల చేసింది. బైక్ అంటే యువతకు ఉన్న పిచ్చి అంతా ఇంతా కాదు… అదీ విదేశీ బైక్ లకు ఉన్న గిరాకీ కూడా ఎక్కువే. ఇక బైక్ పై సాహసాలు చేసేవారికి ఈ బైక్ లు చక్కగా సరిపోతాయని అంటున్నారు. ఈ రెండు బైక్‌లకు 500 సీసీ సామర్థ్యం ఉంది. వీటిలో టీఆర్‌కే 502 ధరను రూ.5 లక్షలుగా నిర్ణయించిన సంస్థ; టీఆర్‌కే 502ఎక్స్ మోడల్ ధరను రూ.5.40 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

గతేడాది హైదరాబాద్‌కు చెందిన మహావీర్ గ్రూపుతో ఈ బైక్‌లను ఉత్పత్తి చేయడానికి బెనెల్లీ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇందుకోసం మహావీర్ గ్రూపు.. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఏడాదికి 7000 బైక్‌ల తయారయ్యే సామర్థ్యం కల యూనిట్‌ను నెలకొల్పుతున్నది. ఈ బైక్‌లకు డిమాండ్ బట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలనుకుంటున్నట్లు బెనెల్లీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జబాఖ్ ప్రకటించారు. గతేడాది దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టడంలో భాగంగా టీఆర్‌కే మోడళ్లను విడుదల చేసినట్లు, ప్రస్తుత సంవత్సరంలో మరిన్ని వాహనాలను విడుదల చేసే అవకాశం ఉందని బెనెల్లీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జబాఖ్ అన్నారు. టీఆర్‌కే 502 మోడల్ బైక్ రెడ్, వైట్, గ్రాఫిటి గ్రే రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

ఈ రెండు బైక్‌ల్లోనూ 500సీసీ, ట్విన్‌ సిలిండర్‌ ఇంజన్‌, 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, 20 లీటర్‌ ఇంధన ట్యాంక్‌ సామర్థ్యంతోపాటు ట్రెడిషినల్ బెనెల్లీ స్టీల్ ట్రెల్లీస్ ఫ్రేమ్, 4- వాల్వ్స్ పర్ సిలిండర్, 47.5పీఎస్ వద్ద 8500 ఆర్పీఎం, 46ఎన్ఎం వద్ద 6000 ఆర్పీఎం టార్చ్ , 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, 120/70 సెక్షన్ అండ్ రేర్ 160/60 సెక్షన్ పిరెల్లి టైర్లు అమర్చారు. రెండు బైక్‌ల్లోనూ ట్విన్ 320ఎంఎం ఫ్లోటింగ్ డిస్క్‌లు, స్విచ్ఛబుల్ ఏబీఎస్ అందుబాటులో ఉంది.

ఈ నూతన బైక్‌లు కావాలనుకునేవారు సోమవారం నుంచి రూ.10 వేలు చెల్లించి ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చునని బెనెల్లీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జబాఖ్ సూచించారు. బెనెల్లీ గతంలో తన బైక్‌లను తయారు చేయడానికి పుణెకు చెందిన డీఎస్‌కే మోటోవీల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది, కానీ డీఎస్‌కే గ్రూపు మోసానికి పాల్పడినట్లు ఆరోపించడంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. ఆ తర్వాత మహావీర్ గ్రూపుతో జత కట్టింది.

Related posts