telugu navyamedia
క్రీడలు వార్తలు

బెన్ స్టోక్స్ తండ్రి మృతి…

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు పితృవియోగం కలిగింది. గత కొంతకాలంగా బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న స్టోక్స్ తండ్రి గెరార్డ్ జేమ్స్ స్టోక్స్ మంగళవారం తుది శ్వాస విడిచారు. మాజీ రగ్బీ ఆటగాడైన జేమ్స్ స్టోక్స్ ఈ ఏడాది జనవరిలో అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారు. గెరార్డ్ స్టోక్స్ మాజీ క్లబ్ వర్కింగ్ టౌన్ ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ సంతాపం తెలిపింది. ‘మా మాజీ ఆటగాడు, కోచ్ గెరార్డ్ స్టోక్స్ ఇక లేరనే వార్త మమ్మల్ని తీవ్రంగా బాధిస్తోంది. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం’అని ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇక న్యూజిలాండ్‌కు చెందిన గెరార్డ్ స్టోక్స్.. ఇంగ్లండ్‌లో రగ్భీ కోచ్‌గా పనిచేసాడు. దాంతో అక్కడే స్థిరపడ్డారు. అప్పుడు బెన్‌కు 12 ఏళ్లు. ఇక 2013లో న్యూజిలాండ్‌కు తిరిగిరాగా.. అదే ఏడాది బెన్.. ఇంగ్లండ్ తరఫున టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇక తండ్రి అనారోగ్యం కారణంగానే స్టోక్స్ పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ నుంచి అర్థంతరంగా తప్పుకున్నాడు. తండ్రికి అండగా ఉండేందుకు న్యూజిలాండ్ వెళ్లాడు. ఆ తర్వాత ఐపీఎల్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక తన తండ్రి ప్రోత్సాహంతోనే ఐపీఎల్‌ ఆడడానికి వచ్చినట్టు స్టోక్స్ అప్పట్లో చెప్పుకొచ్చాడు.

Related posts