telugu navyamedia
సినిమా వార్తలు

“రాక్షసుడు”కు వర్షం లేకుంటే కలెక్షన్స్ సునామీ : బెల్లంకొండ సురేష్

Bellamkonda-Suresh

“అల్లుడు శీను” సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. “కవచం” వరకు అదే పంథాలో నడిచిన ఈ హీరో “సీత” సినిమాతో రూట్ మార్చాడు. భిన్నమైన కథలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తమిళంలో విడుదలైన “రాక్షసన్”ను తెలుగు రీమేక్ “రాక్షసుడు”లో హీరోగా నటించారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఆనందంలో ఉంది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. బి, సీ సెంటర్స్‌లో కూడా ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు ఆదరణ బాగుంది. ఈ సినిమా సక్సెస్ ప్రెస్‌మీట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా బెల్లంకొండ సురేశ్ “రాక్షసుడు” సక్సెస్ పట్ల చిత్ర యూనిట్ సహా తాను కూడా హ్యాపీగా ఉన్నట్లు తెలిపారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ “రాక్షసుడు” సినిమా బడ్జెట్ పరంగా రూ.22 కోట్లు అయ్యింది. సినిమా బిజినెస్ పరంగా చూస్తే ఆంధ్ర, సీడెడ్, నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.12 కోట్లు అమ్ముడు కాగా… హిందీ శాటిలైట్ రూ.12 కోట్లు, తెలుగు శాటిలైట్ రూ.5.90 కోట్లు అయ్యాయి. మొత్తంగా రూ.30 కోట్లకు ఈ సినిమాను అమ్మాం. థియేట్రికల్ రైట్స్‌కు పెట్టిన ఖర్చు రూ.12 కోట్లు నిన్నటికే వచ్చాయి. వర్షాల్లోనూ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. తొలివారంలో చాలా చోట్ల వర్షం వల్ల అంతరాయం కలిగింది. అయితే సెకండ్ వీక్ చూస్తే ఫస్ట్ వీక్ కంటే అద్భుతంగా ఉంది. వైజాగ్, ఈస్ట్ హక్కులను నేనే కొన్నాను. వైజాగ్ ఏరియాలో నిన్నటికే రూ.2 కోట్లు వచ్చాయి. ఈ సినిమా లాభంతోనే స్టార్ట్ అయ్యింది. వర్షం లేకుంటే కలెక్షన్స్ సునామీ స‌ృష్టించేది” అన్నారు.

Related posts