telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సక్సెస్ నాకేమీ నేర్ప‌లేదు… కానీ ఫెయిల్యూర్ చాలా నేర్పింది : బెల్లంకొండ శ్రీనివాస్

Bellamkonda

బెల్లంకొండ సురేష్ తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఈయన తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఆరేళ్ల క్రితం విడుద‌లైన ‘అల్లుడు శీను’తో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. తన ఆరేళ్ల ప్రయాణం గురించి మాట్లాడుతూ ‘స‌క్సెస్ కంటే ఫెయిల్యూర్ నుండే ఎక్కువ నేర్చుకున్నాను’ అని అంటున్నారీ బెల్లంకొండ హీరో. ‘‘సక్సెస్ నాకేమీ నేర్ప‌లేదు. కానీ ఫెయిల్యూర్ వ‌ల్ల విష‌యాల‌ను నేర్చుకునే అవ‌కాశం ద‌క్కింద‌ని చెప్ప‌గ‌ల‌ను. స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకునే విధానంలో మరింత జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వ‌చ్చాను. కెరీర్ ప్రారంభంలో ఫెయిల్యూర్స్ వ‌చ్చిన‌ప్పుడు బాధ‌ప‌డేవాడిని. అయితే మా నాన్న‌గారు ఇంకా ఎక్కువ క‌ష్ట‌ప‌డు. క‌ష్టప‌డితే దాని వెనుకే స‌క్సెస్ ఉంటుంద‌ని ఆయ‌న చెప్పేవారు. ఆయ‌న చెప్పిన దారిలో వెళ్ల‌డం వ‌ల్ల‌నే ‘రాక్ష‌సుడు’ రూపంలో మంచి హిట్ సాధించాను’’ అని అన్నారు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Related posts