telugu navyamedia
సినిమా వార్తలు

బెల్లంకొండ శ్రీనివాస్ కు షాక్… ఏమైందంటే ?

Rakshasudu

“అల్లుడు శీను” సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. “కవచం” వరకు అదే పంథాలో నడిచిన ఈ హీరో “సీత” సినిమాతో రూట్ మార్చాడు. భిన్నమైన కథలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తమిళంలో విడుదలైన “రాక్షసన్”ను తెలుగు రీమేక్ “రాక్షసుడు”లో హీరోగా నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఆనందంలో ఉంది. ఇక ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తున్న సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. “ఈ రోజు కోసం రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాను. ఇంత మంచి హిట్ ఇచ్చిన సత్యనారాయణగారికి జన్మంతా రుణపడి ఉంటాను. ఈ సినిమా రైట్స్ కోసం పెద్ద పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. సత్యనారాయణగారు ఖర్చుకు వెనకాడకుండా రైట్స్‌ను కొని మాపై నమ్మకంతో మాకు ఇవ్వడమే బిగ్గెస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను. సత్యనారాయణగారి బ్యానర్‌లో తొలి సినిమా చాలా పెద్ద హిట్ కొట్టారు. మళ్లీ మళ్లీ ఆయనతోనే పనిచేయాలని కోరుకుంటున్నాను. సత్యనారాయణగారు ప్రేమించి సినిమాను తీశారు. ఎంటైర్ టీమ్ ఎంతో కష్టపడింది. ఈసినిమాలో పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది” అన్నారు.

అయితే తమిళ్‌రాకర్స్ వెబ్‌సైట్‌లో సినిమా విడుదలైన రోజే పైరసీ ‘రాక్షసుడు’ కనిపించడంతో చిత్ర యూనిట్ షాకయింది. కొన్ని పైరసీ వెబ్‌సైట్స్‌ను కట్టడి చేయడంలో టాలీవుడ్ సఫలం అయినప్పటికీ తమిళ్‌రాకర్స్ మాత్రం డొమైన్ ఎక్స్‌టెన్షన్‌ను మార్చుకుంటూ నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ వెబ్‌సైట్‌ను సమూలంగా నిర్మూలించడం నిర్మాతలకు సవాల్‌గా మారింది.

Related posts