telugu navyamedia
సినిమా వార్తలు

హైదరాబాద్ రోడ్లపై బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా…!

Bellamkonda-Srinivas

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైదరాబాద్ రోడ్లపై తిరిగారు. సాధారణ వ్యక్తిలా ప్రయాణికులతో కలిసి ఆటోలు, బస్సులు, మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఆశ్చర్యం కలిగించారు. ట్రిపుల్ రైడ్ చేస్తూ బైక్‌పై చక్కర్లు కొడుతూ సందడి చేశారు. సికింద్రాబాద్ బస్టాప్ వద్ద బస్సులో కిటికీ వైపు కూర్చుని సెల్పీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ తన జర్నీ అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. భాగ్యనగరంలో సాధారణ వ్యక్తిలా తాను కూడా ట్రావెల్ చేశానని చెప్పారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో ప్రయాణికులతో కలిసి తాను తొలిసారి ప్రయాణించానని, ఈ అనుభవాన్ని నమ్మలేకపోతున్నానని తెలిపారు. ట్రిపుల్ రైడ్ చేయడకూదని, తనకు కూడా ట్రాఫిక్ రూల్స్ తెలుసని చెప్పుకొచ్చారు.

Related posts