telugu navyamedia
సినిమా వార్తలు

బెల్లకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో

Bellamkonda Srinivas

బెల్లకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల “రాక్షసుడు” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకు బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసి ఐదేళ్లు అవుతుంది. తాజాగా ఈ ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఆయనెవరో కాదు.. బెల్లంకొండ గణేష్. మొన్న, నిన్నటి వరకు ప్రొడక్షన్ వ్యవహారాలను పర్యవేక్షించిన బెల్లంకొండ గణేష్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం పవన్ సాధినేని దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్ సినిమా తెరకెక్కబోతుందట. వీరిద్దరూ కలిసి కొన్నిరోజులుగా కథా చర్చల్లో బిజీగా ఉన్నారు. ఓ లవ్‌స్టోరీ లైన్ ఓకే అయ్యిందని స్క్రిప్ట్ వర్క్ జరగాల్సి ఉందని అంటున్నారు. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత సినిమాను అధికారికంగా ప్రకటిస్తారట. దసరా తర్వాత సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని టాక్. మరి బెల్లంకొండ గణేష్ తన నటనతో ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటాడో చూడాలి.

Related posts