తాజాగా వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్‌ను ఎంపిక చేసేందుకు సరికొత్త విధానం ఉంది. అదే గ్రీక్ మ్యాథమ్యాటిక్స్. ఎక్కడైనా అమ్మాయి అందాన్ని ఆమె ఫేస్‌లోని ఫీచర్స్, ఫిగర్‌ను బట్టి చూస్తారు. కానీ గ్రీక్ మ్యాథమ్యాటిక్స్ ప్రకారం అమ్మాయి ఫేస్ కొలతలను బట్టి చూస్తారట. గ్రీక్ స్కాలర్స్ చేత సెలబ్రిటీల ఫేస్ కొలతలు తీసుకుని వారిలో ఎవరు అందమైన అమ్మాయో ప్రకటిస్తారు. ఈ రకంగా చూసుకుంటే అమెరికాకు చెందిన ప్రముఖ సూపర్ మోడల్ బెల్లా హ్యాడిడ్ ప్రపంచంలోనే అందమైన అమ్మాయిగా పేరొందారు. 23 ఏళ్ల బెల్లా ఫేస్ కొలతలు 94.35 శాతం పర్‌ఫెక్ట్‌గా ఉందట. ఆ తర్వాతి స్థానల్లో పాప్ సింగర్ బియాన్సే, మూడో స్థానంలో ఆంబర్ హర్డ్, నాలుగో స్థానంలో పాప్ స్టార్ ఆరియానా గ్రాండే ఉన్నారు. లండన్‌కు చెందిన ఫేమస్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ జులియన్ డె సిల్వ ఈ కొలతలను తీసుకున్నారు. మిగతా ఫీమేల్ సెలబ్రిటీలతో పోలిస్తే బెల్లా హ్యాడిడ్ ముఖంలోని ఫీచర్స్ అన్నీ కరెక్ట్ మెజర్‌మెంట్స్ ఉన్నాయని జులియన్ తెలిపారు. బెల్లా హ్యాడిడ్ సూపర్ మోడలే కానీ ఆమో చూడటానికి అంత అందంగా ఉండరు. అసలు అందాన్ని కొలచే ఈ కొత్త రూల్స్ ఏంటో వారికే తెలియాలి. ఏదైతేనేం ఈ రూల్‌తో బెల్లా హ్యాడిడ్ పేరు మారుమోగిపోతోంది. ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకోవడానికి ఎన్నో కంపెనీలు ముందుకొస్తున్నాయి. బెల్లా ఎంత పారితోషికం అడిగితే అంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
previous post