telugu navyamedia
crime news

బీరు ధర రూ.10 పెంచినందుకు ఆగ్రహం.. సేల్స్ మెన్ పై కాల్పులు

Beers supply stopped from liqur depo

అధిక ధరకు బీరు అమ్ముతున్నాడని ఆగ్రహించిన ఇద్దరు యువకులు షాపులో సేల్స్ మెన్ గా పనిచేస్తున్న ఓ యువకుడిని కాల్చిచంపారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది.విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నోయిడాలోని ఐచార్ ప్రాంతంలో ఉన్న ఓ బీరు షాపు వద్దకు సురేంద్ర, రాజు చేరుకున్నారు.

 మిగతా షాపుల కంటే ఇక్కడ రూ.10 అధికంగా అమ్ముతున్నారని యువకులు సేల్స్ మెన్ కుల్దీప్ తో వాగ్వాదానికి దిగారు. వివాదం కాస్తా ముదరడంతో ఇద్దరు యువకులు తమ తుపాకులతో కుల్దీప్ పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లిపోవడంతో కుల్దీప్ రక్తపు మడుపులో పడిపోయాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కుల్దీప్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఏపీ చరిత్రలో ఇంతటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు

vimala p

పాముతో పరాచికాలు… చివరకు ఇలా…?

vimala p

మళ్ళీ పీఎంవో రగడ.. పోలవరం అవినీతిపై చర్చ అవసరం..

vimala p