telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

మెడికల్ షాప్ లో ‘మందు’..యజమాని అరెస్ట్!

karona virus effect on beer sales

దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిత్యావసర దుకాణాలను తెరిచేందుకే అంమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మద్యం దొరకక మందు బాబులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వారి బలహీనతను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ మెడికల్ షాపు యజమానిని కటకటాల పోలీసులు వెనక్కు పంపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగింది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, బార్లు, వైన్ షాపులు మొత్తం బంద్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగపూర్, గణేష్‌పేట్ ప్రాంతంలోని ఓ మెడికల్ షాపు యజమాని నిషాంత్ అలియాస్ బంటీ ప్రమోద్ గుప్తా(36), తన షాపులోనే బీర్ అమ్మకాలు ప్రారంభించాడు. మంచినీళ్ల బాటిల్స్ లో బీర్ ను నింపి ఆయన అమ్మకాలు ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు షాప్ పై దాడిచేశారు. పెద్దమొత్తంలో బీర్ బాటిల్లను స్వాధీనం చేసుకొని, యజమానిపై కేసు నమోదు చేశారు.

Related posts