telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

ఆసుపత్రిలో బీడీ కార్మికురాలిపై అత్యాచారం… గ్రామ సేవకుడి నిర్వాకం

Girl

మహబూబునగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఓ గ్రామంలో బీడీ కార్మికురాలిపై గ్రామ సేవకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళ బీడీ కార్మికురాలిగా పనిచేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం ఇంట్లో ఒంటరిగా పడుకుని ఉంది. మధ్యాహ్న సమయంలో ఆమె ఇంటికి గ్రామసేవకుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి వచ్చాడు. పరిచయస్తుడే కావడంతో ఆ మహిళ అతడితో మాట్లాడింది. ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి మందులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. గ్రామ శివారులోని పశువుల ఆసుపత్రిలోని ఒక గదిలో ఆరోగ్య ఉపకేంద్రం కొనసాగుతుండటంతో అక్కడికి తీసుకెళ్లాడు. ఆదివారం కావడంతో ఆసుపత్రిలో ఎవరూ లేకపోవడంతో మహిళను బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ ఘోరం నుంచి తేరుకున్న బాధితురాలు గ్రామంలోకి వెళ్లి జరిగిన సంఘటన గురించి బంధువులు, గ్రామస్థులకు చెప్పింది. వారి సూచన మేరకు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో తన సోదరుడితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

Related posts