telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సైన్యానికి ఆటవిడుపుగా .. అందాలపోటీలు..

beauty contest to russian army

ఓ అందాల బొమ్మ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని నేషనల్ గార్డ్స్ (ఆర్మీ) నిర్వహించిన బ్యూటీ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచింది. 31 ఏళ్ళ ఈ బ్యూటీ పేరు ‘అన్నా క్రమత్సోవా’ . ఒక బిడ్డకు తల్లి కూడా అయిన ఈమె.. వెయ్యిమందికి పైగా అభ్యర్థులను వెనక్కి నెట్టేసి.. విజేతగా నిలిచింది. సుమారు 57 వేలమంది రష్యన్లు అన్నా క్రమత్సోవా అందానికి ఫిదా అయి..ఆమెకే ‘పట్టం కట్టారు. రైఫిల్ షూటింగ్ తదితర ‘ యుద్ధ విద్యల్లో ‘ ఆరితేరిన అన్నా..గతంలో పోలీసు శాఖలో పని చేసిందట.. ఈమెకు లా డిగ్రీ కూడా ఉంది. ఈమెను పుతిన్ గారి మోస్ట్ బ్యూటిఫుల్ గార్డుగా అంతా ఆకాశానికెత్తేస్తున్నారు.

సైన్యంలో సెక్సిజం ఉండాలని అంటున్న ఈ బ్యూటీ.. తను ఆర్మీలో మామూలుగా కాక, స్టయిలిష్ గా పని చేస్తానని ప్రకటించుకుంది. అంటే.. వేరే చెప్పాలా ? తన కనుసైగలతోనో .. కమ్మని గొంతుతోనో సిబ్బందికి ఆర్డర్లు జారీ చేస్తుందన్న మాట..పైగా.. ఇలాంటి సుందరాంగులంటే అధ్యక్షులవారు కూడా ఐసై పోతారు మరి ! నార్త్ కొరియా అధినేత కిమ్..ఆడ సైన్యంలోనూ ఇలాంటి అప్సరసలు బోలెడు మంది ఉన్న విషయం కూడా ఈ సందర్భంగా చెప్పుకోవలసిందే.

Related posts