telugu navyamedia
telugu cinema news trending

ఏమైనా డైరెక్ట్ గా చెప్పేయొచ్చు.. : రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Sigh images

రకుల్ ప్రీత్ సింగ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మాత్రమే కాదు, బ్రెయిన్ కూడా షార్ప్. ఆమె మాట్లాడే ప్రతీ మాటకు అర్ధం ఉంటుంది. పరమార్ధం ఉంటుంది. తెలుగులో టాప్ స్టార్స్ తో సాంగెసుకున్న ఈ అమ్మడు ఇపుడు తాపీగా సీనియర్ల వైపు చూస్తోంది. నాగార్జునతో మన్మధుడు 2 మూవీని చేస్తున్న రకుల్ హిందిలో అజయదేవగన్ తో మరో మూవీ చేస్తోంది. ఇలా ఒకేసారి ఇద్దరు సీనియర్లతో పనిచేయడం ఇబ్బంది ఏమీ లేదని అంటోంది. తనకు పాత్ర ముఖ్యమని, అవసరమైతే సీనియర్లతో సై అంటున్న రకుల్ తన గురించి కూడా చెప్పుకుంటోంది. తనకు ఏ విషయమైనా పక్కా క్లారిటీతో ఉండాలని, ఉన్నది ఉన్నట్లు చెప్పాలని అంటోంది. ఎవరైనా విషయం దాచడమో లేక నాంచుతూ ఉండడమో చేస్తే అసలు ఇష్టం ఉండదని అంటోంది.

Rakul-Preethతాను ఎంత పెద్ద విషయమైనా వెంటనే చెప్పేస్తామని రకుల్ అంటోంది. తన దగ్గర దాగుడు మూతలు ఉండవని, నచ్చితే ఒకే. లేకపోతే నో ఏ సంగతి అయినా వెంటనే చెప్పేయడమే తనకు అలవాటు అంటోంది. తెలుగులో మన్మధుడు పక్కన మెరుస్తున్న ఆ అమ్మడు మరో మారు యంగ్ హీరోలతో నటించేందుకు రెడీ అంటోంది. టాలీవుడ్ లో మరింతకాలం ఉందామనుకుంటున్న రకుల్ మాత్రం ఆశను ఎక్కడా కోల్పోవడంలేదు. ఒక్క హిట్ పడితే చాలు టాలీవుడ్ లో రకుల్ స్థానం తనకు తిరిగి వచ్చేస్తుందని గట్టిగా నమ్ముతోంది. తన నమ్మకం నిజం అవుతుందనే ఆశిద్దాం..!

Related posts

17 రోజుల్లో 34 లక్షలు… అసలు ఆ మహిళ ఏం చేసిందంటే…!?

vimala p

కేథడ్రల్‌ చర్చికి ఒక్కరోజులోనే వేలకోట్ల విరాళాలు

vimala p

బీజేపీ ఎమ్మెల్యే .. జనసేనలోకి…

vimala p