telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

క్రికెట్ వీరాభిమానికి… బీసీసీఐ అండ.. ప్రపంచ కప్ కోసం .. పెళ్లికూడా వాయిదా..

bcci special invite to great fan of cricket

అభిమానం-వీరాభిమానం అంటే అర్ధం చెప్తున్నాడు..ఈ క్రికెట్ అభిమాని. బీహార్‌కు చెందిన సుధీర్ చౌదరి అనే వ్యక్తికి క్రికెట్ మ్యాచ్‌లంటే మామూలు ఇష్టం కాదు. టీం ఇండియా మ్యాచ్ ఎక్కడ ఉందంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా వందల కిలో మీటర్లు సైకిల్‌పై ప్రయాణించి మరీ మ్యాచ్‌కు వెళతాడు. స్టేడియం లోపలికి ఎంట్రీ కోసం చందాలు అడుక్కుని మరీ టికెట్ కొనుక్కుంటాడు. సుధీర్ అభిమానం గురించి తెలుసుకున్న బీసీసీఐ, ఇండియా మ్యాచ్‌లన్నింటినీ చూసేందుకు అతని అవకాశం కల్పిస్తోంది.

ఇతగాడు వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూడటం కుదరదని తన పెళ్లిని వాయిదా వేసుకోవడమే. అతనికి సచిన్ టెండూల్కర్ అంటే ప్రాణం. మ్యాచ్‌కు హాజరవుతున్నాడంటేనే ఒంటికి, మొహానికి రంగు వేసుకుని మరీ రెడీ అవుతాడు. ప్రపంచక‌ప్‌ కూడా అలాగే హాజరవుతున్నాడు. దీనితో సుధీర్ మ్యాచ్‌కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు.

Related posts