telugu navyamedia
క్రీడలు వార్తలు

రేపు బీసీసీఐ అధికారుల సమావేశం…

అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ను ముప్పతిప్పలు పెడుతోొంది..మూడు చెరువుల నీళ్లను తాగిస్తోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను నిర్వహించడం ఒక ఎత్తయితే.. ఐపీఎల్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను షెడ్యూల్ చేయడం మరో ఎత్తుగా మారింది. ఈ రెండూ బీసీసీఐకి కఠిన సవాళ్లను విసురుతున్నాయి. బీసీసీఐ సహా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ క్యాలెండర్లను నిర్దేశించుకోవడం ఐపీఎల్ 2021 ఫేస్ 2 నిర్వహణకు అడ్డంకిగా మారినట్టయింది. ఈ పరిణామాల మధ్య బీసీసీఐ శనివారం ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ ఆరంభం కావొచ్చు. బీసీసీఐ అధినేత సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జయ్ షా సహా గవర్నింగ్, జనరల్ బాడీ భేటీ అవుతుంది. ఇందులో తీసుకునే నిర్ణయాలే ఐపీఎల్ 2021 ఫేస్ 2 భవితవ్యాన్ని శాసించబోతోన్నాయి. దీనితో పాటు- టీమిండియా పర్యటనల షెడ్యూల్‌పైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

Related posts