telugu navyamedia
క్రీడలు రాజకీయ వార్తలు

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గంగూలీ

sourav ganguly as bcci president

బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన బోర్డు సర్వసభ్య సమావేశంలో ఈ రోజు బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ బోర్డు పగ్గాలు చేపట్టిన రెండో క్రికెటర్‌ ఆయనే. 1954లో విజయనగరం మహారాజు, భారత మాజీ కెప్టెన్ విజయానంద గజపతిరాజు బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఒక మాజీ క్రికెటర్‌ పూర్తిస్థాయి బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.

బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. 33 నెలల పాటు బీసీసీఐని నడిపిన సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ పదవిలో గంగూలీ పది నెలల పాటు ఉంటారు. మరోవైపు, బీసీసీఐ కార్యదర్శిగా కేంద్ర మంత్రి అమిత్‌షా కుమారుడు జై షా, కోశాధికారిగా అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ సింగ్‌ ధూమల్‌ బాధ్యతలు స్వీకరించారు.

Related posts