telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కార్తీక్ పై .. వేటు అందుకేనా..

bcci on dinesh karthik

బీసీసీఐ భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ను వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేయకుండా షాక్ ఇచ్చింది. తాజాగా బోర్డు అతనికి నోటీసులు పంపి మరో షాక్ ఇచ్చింది. ఈ షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి కారణం, కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు తరుపున దినేష్ కార్తీక్ ప్రమోషన్స్ లో పాల్గొనడం. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈజట్టు కు యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్స్ రైడర్ కు కూడా షారుఖ్ సహా యజమాని కాగా దినేష్ కార్తీక్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. దాంతో షారుఖ్ తో కలిసి ట్రిన్ బాగో నైట్ రైడర్స్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.

అందులో భాగంగా ట్రిన్ బాగో డ్రెసింగ్ రూమ్ లో ఆ జట్టు జెర్సీ ని ధరించాడు దినేష్ కార్తీక్. ఆఫొటోలు కాస్త బీసీసీఐ దాక చేరడం తో వెంటనే అతనికి నోటీసులు పంపించింది. ఇలాంటి ఈవెంట్ లలో పాల్గొనాలంటే బీసీసీఐ నుండి పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే బోర్డు ను సంప్రదించకుండానే కార్తీక్ ఆ ఈవెంట్ లో పాల్గొనడంతో అతనికి షోకాజ్ నోటీసులు పంపించింది. ఎందుకు తనపై క్రమశిక్షణా ఉల్లంఘన కింద చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి, కార్తీక్ కు నోటీసులు జారీచేశాడు.

Related posts