telugu navyamedia
క్రీడలు రాజకీయ వార్తలు సామాజిక

బీసీసీఐ కొత్త ట్రావెల్ పాల‌సీ.. ఆటగాళ్లు భార్యలను తీసుకురావద్దు..!

pak objection on team india with army cap

ఎప్పుడూ విదేశీ పర్యటనలకు వెళ్లినా సహజంగా క్రికెటర్లు తమ భార్యలతో కలిసి వెళ్తుంటారు. ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ పయనమయ్యే భారత జట్టుతో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు వెళ్లేందుకు బీసీసీఐ కొత్త ట్రావెల్ పాల‌సీని తీసుకొచ్చింది. టీమిండియా స్వ‌దేశాన్ని వ‌దిలి వెళ్లిన 20 రోజుల త‌ర్వాత భారత ఆటగాళ్లు తమ భార్య, ప్రియురాళ్ల (వాగ్స్‌)తో క‌లిసి ఉండేందుకు అనుమ‌తిస్తామ‌ని బీసీసీఐ తాజాగా వెల్ల‌డించింది.

దీంతో నెలన్నర పాటు జరిగే వన్డే ప్రపంచకప్‌లో కేవలం 15 రోజులు మాత్రమే ఆట‌గాళ్ల‌తో గడిపే అవకాశం కుటుంబ‌స‌భ్యుల‌కు ఉంది. . గతంలో విదేశీ ప‌ర్య‌ట‌న ఆరంభ‌మైన‌ తొలి రెండు వారాల తర్వాత అనుమతించేవారు. అంతేకాదు ఇక నుంచి మ్యాచ్‌ల సమయంలో స్టేడియాలకు వెళ్లేటప్పుడు ప్లేయర్స్ బస్‌లో కాకుండా మరో ప్రత్యేక వాహనంలో మాత్రమే వారంతా వెళ్లాల్సి ఉంటుంది. మే 22న విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ కు వెళ్లనుంది.

Related posts