telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

కరోనా ప్రభావంతో ఈ ఏడాది ఐపీఎల్ 2020 రద్దు అయ్యే అవకాశం…!

ipl

భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరమైన విషయమని ఇవాళ విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ భారత పార్లమెంట్ కు తెలిపారు. వీలైనంత వరకు ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం మంచిదని జైశంకర్ ప్రజలకు విజ్ణప్తి చేశారు. ప్రయాణాలు చేయడం అంటే రిస్క్ తో కూడుకున్న పనేనని ఆయన తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది ఏపీఎల్ ను నిలిపివేసే అవకాశాలపై బీసీసీఐ చర్చలు జరుపుతుందట. ఐపీఎల్ 2020ని నిలిపివేసే అవకాశాలపై బీసీసీఐలో డిస్కషన్ జరుగుతందని బోర్డు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. టీమ్ లకు నష్టపరిహారం విషయంపై శనివారం బీసీసీఐ చర్చించనున్నట్లు సమాచారం ఐపీఎల్…నిర్వహించాలా వద్దా అని ఫైనల్ నిర్ణయం తీసుకునేందుకు మార్చి-14,2020న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. కరోనా వైరస్ దృష్యా ఇప్పటికే పలు దేశాల ప్రజలకు జారీ చేసిన వీసాలను కూడా భారత్ రద్దు చేసింది. వీసాల రద్దుతో ఏప్రిల్-15,2020వరకు విదేశీ ప్లేయర్లు భారత్ లోకి అడుగుపెట్టే అవకాశం లేదు. దీంతో విదేశీ ప్లేయర్లు ఐపీఎల్ లో పాల్గొనే ఛాన్స్ లేదు. షెడ్యూల్ ప్ర కారం…మార్చి29న ముంబై వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తో ఐపీఎల్ 2020 ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా దృష్యా ఈ ఏడాది ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశం సృష్టంగా కనిపిస్తోంది.

.

Related posts