telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐసీసీ నిబంధనలకు .. తలొగ్గిన బీసీసీఐ..ధోని గ్లోవ్ పై లోగో..

bcci strong support to dhoni on glove issue

మొత్తానికి ఐసీసీ నిబంధనలకు బీసీసీఐ తలొగ్గాల్సి వచ్చింది. అందరూ అండగా ఉన్నా, నియమ నిబంధనలకు తలొగ్గి, ధోని గ్లోవ్ పై లోగో తొలగించేందుకు సిద్ధం అయ్యింది బీసీసీఐ. టీమిండియా కీపర్‌-బ్యాట్స్‌మెన్‌ ఎంఎస్‌ ధోని కీపర్‌ గ్లోవ్స్‌పై ఉన్న భారత ప్యారా బలగాల చిహ్నం( బలిదాన్‌ బ్యాడ్జ్‌ ) తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని బిసిసిఐ స్పష్టం చేసింది.

ఐసిసి ఈవెంట్స్‌కు సంబంధించిన నిబంధనల ప్రకారం ఆటగాళ్ల జెర్సీ, పరికరాలపై ఎలాంటి వ్యక్తిగత సందేశాలు, లోగోలు ఉండడానికి వీల్లేదు. వికెట్‌ కీపింగ్‌ గ్లోవ్స్‌పై స్పాన్సర్‌ లోగో మాత్రమే ఉండాలని ఐసిసి కోరడంతో బిసిసిఐ మెట్టుదిగింది. ఐసిసి నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని, నిబంధనలకు వ్యతిరేకంగా ఏ పని చేయమని బిసిసిఐ చీఫ్‌ వినోద్‌ స్పష్టం చేశారు.

Related posts