telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినిమాల అవకాశాలు లేక మళ్లీ సీరియల్స్‌ లోకా… ?… కౌశల్ మండాపై నెటిజన్ విమర్శ

kaushal

బిగ్ బాస్-2 టైటిల్ విన్నర్, ప్రముఖ బుల్లితెర నటుడు కౌశల్ మండకు ఓ హీరోకు ఉన్నంత పాపులారిటీ ఉంది. బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ ఇప్పుడు మళ్లీ సీరరియల్స్‌లో నటిస్తున్నారు. బిగ్ బాస్‌కి ముందు కూడా కౌశల్ సీరియల్స్‌లో నటిస్తుండేవారు. బిగ్ బాస్‌లో అవకాశం రావడంతో సీరియల్స్‌కి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆ సెలబ్రిటీ రియాల్టీ షోలో విన్నర్ అయినా కూడా ఆయన మళ్లీ సీరియల్స్‌లోనే నటిస్తున్నారు. ‘సూర్యవంశం’ అనే సీరియల్‌లో ఆది శంకర్ అనే పాత్రలో నటించేవారు. ఇప్పుడు ఆ పాత్రను మళ్లీ కొనసాగిస్తున్నారు. ‘ఆదిశంకర్ మళ్లీ మీ ముందు వచ్చేశాడు. ఇక మీరు నన్ను రోజూ మిస్ అవ్వరు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేశారు. అయితే ఈ ఫొటోపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘బిగ్ బాస్ కోసం సీరియల్స్ వదులుకున్నావ్. సినిమాల అవకాశాలు లేక మళ్లీ సీరియల్స్‌లోకే వచ్చావ్. ఆల్ ది బెస్ట్’ అని పోస్ట్ చేశాడు. ఇందుకు కౌశల్ స్పందిస్తూ “నటనలో చిన్న పెద్ద అనే తేడా ఏమీ ఉండదు. మనల్ని ప్రేమించేవారు మనల్ని రోజూ చూడగలుగుతున్నారా లేదా అనేదే ముఖ్యం” అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ఈ రిప్లైతో కౌశల్ మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. బిగ్ బాస్‌లో పాల్గొన్నప్పుడు ‘కౌశల్ ఆర్మీ’ అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు చేసిన రచ్చ తెలిసిందే.

Related posts